ఇన్వెస్ట్ మెంట్ యాప్ లింక్ ను వాట్సాప్ చేసిన 10 లక్షల పైగా కాజేశాడు ఓ సైబర్ కేటుగాడు. నగరానికి చెందిన వెంకట వంశీకృష్ణ అనే వ్యక్తి వాట్సాప్ నెంబర్ కు కొన్ని రోజుల క్రితం ఓ లింక్ వచ్చింది. ఇండియా మార్ట్ డాట్ కామ్ పేరుతో ఉన్న లింక్ ను క్లిక్ చేసిన వంశీకృష్ణ అందులో ఉన్న మ్యాటర్ చదివి ముందుగా 500 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. ఆ వెంటనే అతనికి రెట్టింపు లాభం వచ్చింది.
తర్వాత 1000 రూపాయలు…ఆపైన ఇన్వెస్ట్ చేయగా గంటల వ్యవధిలో లాభాలు కనిపించాయి. దీంతో 10లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ తర్వాత యాప్ తెరుచుకోవడం ఆగిపోయింది. ఇండియా మార్ట్ కు కాల్ చేసి ఆరాతీయగా అలాంటి యాప్ లేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన వంశీకృష్ణ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాడు.