2017 ఏప్రిల్ 29 న మిస్ అయిన తమ కొడుకు పాకిస్థాన్ లో బందీగా ఉన్నాడంటూ ప్రశాంత్ తండ్రి మీడియా ముందుకువచ్చారు. తమ కొడుకు అమాయకుడని, ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేడని ఆవేదన వ్యక్తం చేశారు. 2013 నుంచి హైదరాబాద్ లో ఉంటున్నామని, ప్రశాంత్ మాదాపూర్ లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తుండేవాడని అన్నారు.
2107 ఏప్రిల్ లో ఆఫీస్ కి బయలుదేరిన తరువాత ప్రశాంత్ కనపడకండా పోయాడని తండ్రి చెప్తున్నాడు. అయితే… తాను ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. తన ప్రేమ విషయం కూడా తమకు ఎప్పుడూ చెప్పలేదని, ఫేస్ బుక్ ద్వారా విషయం తెలుసుకున్నానని చెప్పాడు.
ప్రశాంత్ ప్రేమించిన స్వప్నిక కూడా తనతో ఎప్పుడూ మాట్లాడలేదని, తన కొడుకు పాకిస్థాన్ చెరలో ఉన్నాడని మీడియా లో వచ్చిన తరువాత ఇండియా ఎంబసీ ని కలవటానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రశాంత్ తండ్రి చెప్పారు. 2017 ఏప్రిల్ 29వ తేదీన ఈ విషయమై తాము పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ప్రశాంత్ వద్ద ఫోన్ కూడ లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు.