ప్రైవేట్ జాబ్ అంటే..తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిది. ఇక్కడ తుమ్ము అంటే మీనింగ్ కోపం. యజమానికి కోపం వచ్చినా ఉద్యోగే బైటకు పోవాలి.ఉద్యోగికి కోపం వచ్చినా ఉద్యోగే బైటకు వచ్చేయాలి.
వెరసి ఆ ఎంప్లాయ్ ప్లేస్ లోకి మరో ఎంప్లాయ్ వస్తాడు. అదీ మ్యాటరు. అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే. జాబ్ నుంచి తొలగించారన్న ప్రతీకారంతో ఒక వ్యక్తి దుశ్చర్యకు పాల్పడ్డాడు.
పలు వాహనాలపై యాసిడ్ పోశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 75లోని మాక్‌్ోబ్లిస్ వైట్ హౌసింగ్ సొసైటీలో 25 ఏళ్ల రామ్‌రాజ్ అనే వ్యక్తి 2016 నుంచి కార్ల క్లీనింగ్ పని చేస్తున్నాడు.
అయితే అతడి పని పట్ల కొందరు నివాసితులు కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతడ్ని ఆ పని నుంచి తీసేయాలని నిర్ణయించారు.
కాగా, కార్ల క్లీనింగ్ పని నుంచి తనను తొలగించడంపై రామ్‌రాజ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. హౌసింగ్ సొసైటీకి వచ్చి సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న సుమారు 12కుపైగా కార్లపై ఒక బాటిల్‌లోని యాసిడ్‌ను చల్లాడు.
అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తమ కార్లపై యాసిడ్ పోసి ధ్వంసం చేసిన విషయం తెలుసుకున్న నివాసితులు హౌసింగ్ సొసైటీలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
కార్లు క్లీనింగ్ పని నుంచి తొలగించిన రామ్‌రాజ్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుసుకున్నారు. ఆ వీడియో ఫుటేజ్ ఆధారాలతో సహా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు సొసైటీ సెక్యూరిటీ సిబ్బంది రామ్‌రాజ్ కోసం వెతికి అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. అయితే నిందితుడు కార్లపై యాసిడ్ పోస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#बेरोजगार हो जाने के गुस्से की #आग
ऐसी भड़की की 15 गाड़ियों के अंदर #तेजाब डाल दिया इस शख्स ने 😳मामला #Noida के #Sector_75 की सोसायटी का है, जहां के कार सफाईकर्मी
को नौकरी से निकाल दिया गया था. pic.twitter.com/sUhIvTyBPl— Ruby Arun रूबी अरुण روبی ارون 🇮🇳 (@arunruby08) March 17, 2023