విజయవాడ మొగల్రాజపురంలో కరెంటు స్డంభం ఎక్కిన యువకుడు హల్ చల్ చేశాడు. రేషన్ కార్డు ఇవ్వడం లేదంటూ భాలవలస కోటేశ్వర్రావు అనే కరెంటు స్థంభం ఎక్కి ఆందోళన చేశాడు. ప్రజలు కరోనా వలన చనిపోవడం లేదు ఆకలితో చనిపోతున్నామంటూ ఆవేదన కోటేశ్వర్రావు ఆవేదన వ్యక్తం చేశాడు. వాలంటీర్ లు ఉన్న కూడా రేషన్ కార్డు జారీ చేయడం లేదు. కలెక్టర్ తక్షణమే రేషన్ కార్డు జారీ చేస్తే నే కిందికి కి దిగుతానంటూ పట్టుబట్టాడు. యువకుడి బంధువులు ను పిలిపించి కింద కి దింపేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.