ఓ వ్యక్తి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. చేత్తో లాగడమే కష్టసాధ్యమైన బరువుని.. కేవలం దంతాలతో లాగి గిన్నిస్ రికార్డు కొట్టేసాడు. ఈజిప్టుకు చెందిన అష్రఫ్ సులేమాన్..ఈ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
సుమారు 15,730 కేజీల బరువు ఉన్న ఓ భారీ ట్రక్కును అతను ఈజీగా తన దంతాలతో లాగేశాడు. దీంతో అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ వీడియోను పోస్టు చేసింది.
ఈజిప్టు రోడ్లపై సులేమాన్ తన దంతాలకు.. ట్రక్కుకు ఓ తాడిని కట్టి లాగాడు.అయితే ఈ వీడియో నెటిజన్ల దృష్టిలో పడింది. 2021 జూన్ 13వ తేదీన సులేమాన్ ఆ రికార్డును క్రియేట్ చేసినట్లు గిన్నిస్ బుక్ పేర్కొన్నది. రెండు రోజుల క్రితమే ఈ వీడియోను షేర్ చేశారు. ఇప్పటికే దానికి 4 లక్షల వ్యూవ్స్ వచ్చాయి.