ఓ వ్యక్తి పోలుసుల్ని ముప్పుతిప్పలు పెట్టించాడు. ఓ కారు చోరీ చేసి నగరమంతా తిప్పించాడు. ముందుగా ఓ చోట దొంగను పట్టుకున్నారు పోలీసులు. అయితే అతడు నైస్ గా తప్పించుకున్నాడు. యూకేలో జరిగిందీ ఘటన.
ఆ తర్వాత కారుతో సహా రైల్వే స్టేషన్ లోకి దూసుకెళ్లాడు దొంగ. అక్కడి నుంచి రైల్వే ట్రాక్ పైకి వెళ్లాడు. పోలీసులు వెంటపడుతుండడంతో పట్టాలపైనే వేగంగా కారుతో ముందుకు కదిలాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.