ప్రముఖ చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ మ్యాన్ రే రూపొందించిన ఫోటో ఒకటి రికార్డ్ ధర పలికే అవకాశం ఉంది. లే వయోలన్ డి ఇంగ్రేస్ అనే పేరుతో పిలిచే ఈ ఫోటోను 1924లో తీశాడు. తాజాగా దీన్ని వేలం వేసేందుకు చూస్తున్నారు.
వేలంలో ఇప్పటివరకు ఆండ్రియాస్ గుర్స్కీ ఫోటో 4.3 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. మ్యాన్ రే తీసిన ఫోటో 5 నుంచి 7 మిలియన్ డాలర్లు పలుకుతుందని అంచనా వేశారు. అదే జరిగితే వేలం చరిత్రలో కొత్త రికార్డ్ సృష్టించినట్లు అవుతుంది.
ఒక మహిళ నగ్నంగా ఉన్న వెనుక భాగాన్ని వయోలిన్ ను తలపించే విధంగా తీసిన ఈ ఫొటోను దక్కించుకునేందుకు ప్రముఖులు పోటీపడుతున్నారు. ఈ ఒరిజినల్ మాస్టర్ పీస్ ను బ్రిటీష్ అక్షన్ కంపెనీ క్రిస్టీస్ మే నెలలో వేలం వేయనుంది.
1962లో న్యూయార్క్ జంట మ్యాన్ రే నుంచి ఈ చిత్రాన్ని పొందగా.. దశాబ్దాలుగా వారి ఆర్ట్ కలెక్షన్స్ లో ఇది ఉండిపోయింది. ప్రస్తుతం దీన్ని క్రిస్టీస్ సంస్థ వేలానికి సిద్ధం చేస్తోంది.