భారత పర్యటనకు వచ్చి వెళ్లాక చాలా మంది విదేశీయులు ఇక్కడి విషయాలను తమ స్నేహితులతో పంచుకుంటారు. ముఖ్యంగా ఇక్కడి ప్రజల గురించి, తమకు ఎదురైన అనుభవాలను గురించి, దేశ సంస్కృతి, గొప్పదనం గురించి వారికి వివరిస్తూ ఉంటారు.
తాజాగా అమెరికాకు చెందిన స్టెఫా మహిళ తనకు ఇండియాలో ఎదురైన ఓ ఆసక్తికర అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. తాను కొన్ని రోజుల క్రితం భారత్ కు వచ్చానని చెప్పింది. గుజరాత్ కు రైళ్లో వెళుతున్న సమయంలో తన పర్స్ మరిచి పోయి స్టేషన్ లో దిగిపోయానని చెప్పింది.
కొన్ని రోజుల తర్వాత తన ఇన్ స్టా ఖాతాకు ఓ మెసేజ్ వచ్చిందన్నారు. మీ పర్స్ దొరికిందని, దాన్ని మీకు ఇచ్చి వేస్తానంటూ చిరాగ్ అనే వ్యక్తి మెసేజ్ చేశాడన్నారు. దీంతో భుజ్‌లో ఉన్న చిరాగ్ దగ్గరకు వెళ్లానన్నారు. అతను ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడన్నారు.
తాను అక్కడకు వెళ్లగానే చిరాగ్ తన పర్స్ ఇచ్చి వేశాడన్నారు. కృతజ్ఞతగా అతనికి కొంత డబ్బు ఇచ్చానన్నారు. కానీ దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించాడన్నారు. పర్స్ లో అన్ని వస్తువులు ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోండని అతను తనకు సూచించడన్నారు.
దీంతో తాను కన్నీటి పర్యంతమయ్యనన్నారు. భారత్ గురించి తాను చాలా నెగెటివ్ వార్తలు విన్నానన్నారు. కానీ ఇక్కడి ప్రజలు చాలా పాజిటివ్ గా ఉన్నారన్నారు. భారత్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
చిరాగ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత పర్యటక రంగానికి చిరాగ్ నిజమైన అంబాసిడర్ అంటూ కొందరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీ పర్సు వచ్చినందుకు సంతోషిస్తున్నామని, చిరాగ్ లాంటి వ్యక్తులను చూసినట్టు చాలా గర్వంగా ఉంటుందని మరికొందరు అంటున్నారు.