అకస్మాత్తుగా పై నుంచి నోట్ల వర్షం కురవడంతో అవాక్కయ్యారు జనం. అనంతరం ఆ షాక్ నుంచి తేరుకుని నోట్లు ఏరుకునే పనిలో పడ్డారు. ఈ అనూహ్య ఘటన బెంగళూరులోని కేఆర్ మార్కెట్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం చేటుచేసుకుంది. ఓ యువకుడు రూ.10 నోట్లను కిందకు విసురుతూ కెమెరాకు చిక్కాడు. పది రూపాయల నోట్ల రూపంలో రూ.3,000 వరకూ అతను ఫ్లైఓవర్ రెండు వైపుల నుంచి విసిరాడు.
సహజంగా ఫ్లైఓవర్ ఏరియా నిత్యం రద్దీగా ఉంటుంది. ఫ్లైఓవర్ పై నుంచి కరెన్సీ నోట్లు వాహనదారులపై మొదట అవాక్కైన జనం.. ఆ తర్వాత వాటిని అందుకునేందుకు పోటీపడ్డారు. జనం ఒక్కసారిగా పోగవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
అయితే అప్పటికే అగంతకుడు అక్కడ్నించి మాయమయ్యాడు. ప్రాథమిక సమాచారం బట్టి వైరల్ వీడియో షూట్ చేయడం కోసం ఆ వ్యక్తి ఈ పని చేసినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై తమకు అంతగా సమాచారం లేదని, ఏది ఏమైనప్పటికీ దీనిపై పూర్తి వివరాలు తెలుసుకుని తదుపరి సమాచారం తెలియజేస్తామని వెస్ట్ డీసీపీ లక్ష్మణ్ నింబారగి వెల్లడించారు.