శాసనసభ సమావేశాల వేళ… తెలంగాణ అసెంబ్లీ సమీపంలో కలకలం రేగింది. రవీంద్రభారతి ఎదుట ఓ ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ.. తనతో పాటు బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అది గమనించి వెంటనే మంటలు ఆర్పేవేశారు. గాయలతో ఉన్న బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతని శరీరపై భాగం కాలిపోయింది. బాధితుడు మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి నాగులుగా పోలీసులు గుర్తించారు
.
ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆత్మహత్యాయత్నానికి ముందు నాగులు జై తె లంగాణ నినాదాలు చేశాడు. తాను బతికేందుకు పని లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కేసీఆర్ తనను ఆదుకోవాలని కోరాడు. ఆ వెంటనే ఒంటిపై పెట్రోలో పోసుకున్నాడు. కాగా బాధితుడు ఓ ప్రైవేట్ టీచర్ అని తెలుస్తోంది