తాను ప్రేమించిన అమ్మాయి.. తనని కాదని వేరే యువకుని తో పెళ్లికి సిద్ధం అవడంతో తట్టుకోలేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజేంద్రనగర్‌లో ఉండే ప్రవీణ్.. ఇటీవల కానిస్టేబుల్ పరీక్షల్లో అర్హత సాధించి మెయిన్స్‌కు ప్రీపేర్ అవుతున్నాడు.
ప్రవీణ్ కు గత కొంత కాలం నుంచి ఓ యువతితో ప్రేమాయణం ఉంది. అయితే కొద్ది రోజుల నుంచి ఆమె విజయ్ భాస్కర్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయం తెలిసిన ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
చనిపోవడానికి ముందు ప్రవీణ్ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.. అంతేకాకుండా సూసైడ్ నోట్ కూడా రాశాడు. అందులో తన చావుకు కారణమైన యువతితో పాటు ఆమె ప్రియుడ్ని వారికి సహకరించిన స్నేహితులన్ని కఠినంగా శిక్షించాలని ఆ లెటర్ లో కోరాడు. ఈ మేరకు రాజేంద్ర నగర్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రవీణ్ కి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పొయాడు. బంధువుల వద్దే పెరిగిన ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడంతో వారంతా విషాదంలో మునిగిపోయారు.