కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు భయాంతో వణికిపోతున్నారు. కరోనా లక్షణాలతో ఆస్పత్రులు, ఐసొలేషన్ వార్డుల్లో చేరిన చాలామంది… తమకు కరోనా సోకిందా అనే అనుమానంతో మానసిక వేదనకు గురవుతున్నారు. తాజాగా తనకు కరోనా వచ్చిందనే అనుమానంతో 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. రాష్ట్రంలో షామ్లీ పట్టణానికి చెందిన వ్యక్తి రెండు రోజులుగా ఐసోలేషన్ వార్డులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు అధికారులు. అతడి రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. అయితే తనకు కరోనా వచ్చిందనే భయంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ వ్యక్తి… ఐసోలేషన్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్థాపం కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టు వైద్యులు తెలిపారు.