ముంబై: మూడేళ్ల చిన్నారిని ఏడంతస్థుల నుంచి కిందికి విసిరేశాడు ఓ దుర్మార్గుడు. ముంబైలోని కొలాబాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాత్రి వేళ ఈ దారుణం జరిగింది. రాత్రి ఏడున్నర గంటలలో అపార్ట్‌మెంట్ పెద్ద శబ్దం వచ్చింది. అందరూ చూసే సరికి రక్తపు మడుగులో చిన్నపాప కనిపించింది. తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. ఆ చిట్టి తల్లి శరీర భాగాలు ఛిద్రమైన దృశ్యం చూసి అందరూ విచలితులయ్యారు. తీవ్ర ఆవేదన చెందారు. ఆ చిన్నారిని ఏడో అంతస్థులోని ఓ కిటికిలోంచి పడినట్టు గుర్తించి అక్కడికి పరిగెత్తారు. మూడేళ్ల చిన్నారి అంత ఎత్తు కిటికీ ఎక్కలేదని గ్రహించిన వాళ్లు జాగ్రత్త పడి ముందు అపార్ట్‌మెంట్‌ని బ్లాక్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. చిన్నారి తండ్రి స్నేహితుడు 40 ఏళ్ల అనిల్ చుగానీ ఈ చిన్నారిని తోసేశాడని అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకింత అమానుషానికి పాల్పడ్డాడో తెలియలేదు. పోలీసులు అనిల్ చుగానీని అరెస్టు చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారి చూసి తల్లిదండ్రులు కంటికి ధారలా ఏడుస్తున్నారు. వారిని ఆపడం ఎవరి తరం కాదు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » చిట్టితల్లిని తోసేశాడు