ఇల్లు అద్దెకు ఇస్తానని చెప్పి తీసుకెళ్లి మహిళపై అత్యాచారయత్నం చేశాడో వ్యక్తి. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ మహిళకు హమీద్ ఖాన్ ఫోన్ చేశాడు. ఓవైసీ ఆస్పత్రి దగ్గరకు వస్తే ఇల్లు ఇస్తానని సదరు మహిళకు హమీద్ తెలిపాడు.
దీంతో ఆస్పత్రి దగ్గరకు వచ్చిన ఆమెను నిందితుడు అక్బర్ బాగ్ కు తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెను ఓ ఇంటికి తీసుకువెళ్లి సెల్ ఫోన్ లాక్కుని, బ్యాగ్ పడేసి ఆమెను బంధించాడు.
ఆమెపై అత్యాచారయత్నం చేయగా ప్రతిఘటించి అతనిపై దాడి చేసి కేకలు పెట్టింది. చివరకు ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫ్లాట్ అండ్ ఫ్లాట్ మేట్ యాప్ ద్వారా ఆ మహిళ నెంబర్ ను నిందితుడు సేకరించాడు. ఇల్లు అద్దెకు ఇస్తామని వంకతో కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించింది. వీటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతోంది.