కర్వా చౌత్ పండగ వేళ గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ చేద్దామనుకున్నాడు ఓ వ్యక్తి… కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. అదే షాపింగ్ మాల్ కు అత్తగారితో కలిసి షాపింగ్ కి వచ్చింది భార్య. ఇక అంతే అతన్ని పట్టుకుని చితకబాదింది.
ఈ ఘటన ఘజియాబాద్ మార్కెట్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త కాలర్ పట్టుకుని, మరికొంత మంది మిత్రులతో కలిసి అతనిపై భార్య దాడి చేసింది. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్ అతన్ని రక్షించబోయింది.
దాంతో మిగిలిన ఆడవాళ్లు ఆమెపై దాడి చేశారు. షాప్ ఓనర్ మాత్రం మీరు బయటకు వెళ్లాలంటూ అరుస్తున్నట్లు వీడియోలో వినిపించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. ఇటీవల భర్తతో గొడవ పడ్డ భార్య.. తన తల్లితండ్రులతో కలిసి ఉంటోంది.
కర్వా చౌత్ పండగ సందర్భంగా పేరెంట్స్‌తో కలిసి ఆమె షాపింగ్‌కు వచ్చింది. అయితే అక్కడే ఓ అమ్మాయితో తిరుగుతున్న భర్తను ఆమె గుర్తించి తన్ని వదిలి పెట్టింది.
करवा चौथ के दिन दूसरी महिला काे शॉपिंग करवाने आया था पति। पत्नी ने पकड़ा। https://t.co/T3jB1xVOWn pic.twitter.com/gSFGxGaghn
— Ankit tiwari/अंकित तिवारी (@ankitnbt) October 13, 2022