అర్ధరాత్రి ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. కన్న తల్లి, తోడబుట్టిన సోదరుడిపై ఇనుపరాడ్ తో దాడికి దిగాడు. హైదర్ గూడకు చెందిన సందీప్ రెడ్డి కుటుంబ కలహాలతో తన తమ్ముడు ప్రదీప్ రెడ్డిపై దాడి చేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లి స్వరూపపై దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన స్థానికులపైన కూడా దాడికి తెగబడ్డాడు. ఓపిక నశించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సందీప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రగాయాలతో బాధపడుతున్న ప్రదీప్ రెడ్డి, స్వరూపలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.