– మన ఊరు-మన బడి గోల్ మాల్
– గ్రీన్ బోర్డుల టెండర్ కూడా రద్దు
– హైకోర్టుకు స్పష్టం చేసిన సర్కార్
– మొన్నడ్యుయెల్ డెస్క్, ఫర్నీచర్ టెండర్ల రద్దు
– తొలివెలుగు దెబ్బకు మేఘాకు చుక్కలు
Advertisements
క్రైంబ్యూరో, తొలివెలుగు:మన ఊరు- మన బడి స్కాములపై మొదట్నుంచి తొలివెలుగు క్రైంబ్యూరో చెబుతూనే ఉంది. మెగా స్కెచ్ వేసింది ఎలా..! పథక రచన ఎక్కడ..! ఎలా అమలు పరిచారు..! ఇలా ప్రతీ అక్రమాన్నిఆధారాలతో సహా కథనాలు ఇచ్చింది. ఇప్పుడు హైకోర్టు ఇస్తున్నఆదేశాలతో తొలివెలుగు అక్రమార్కులపై చేస్తున్నపోరాటానికి న్యాయం దక్కినట్టైంది. మొన్నడ్యుయెల్ డెస్క్, ఫర్నీచర్ టెండర్ల అవకతవకలను ఒప్పుకున్నతెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్..తాజాగా గ్రీన్ బోర్డుల విషయంలోనూ చేసేదేం లేక అదే దారి పట్టింది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ కేసుపై విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వొడ్యారపు రవికుమార్ వాదనలు వినిపించారు. లక్ష్మణ్ బెంచ్ ఆయన వాదనలతో ఏకీభవించింది. ఈ సందర్భంగా అధికారులు ఈ టెండర్ ను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
మిగిలిన టెండర్ల మాదిరిగానే గ్రీన్ చాక్ బోర్డ్స్ లో కూడా మేఘాతో పొత్తున్నకంపెనీలకే టెండర్లు దక్కాయి.తక్కువ ధరకు టెండర్స్ వేసిన వారికి ఇచ్చేందుకు టెక్నికల్ గా మీరు నిజాయితీగా పనిచేస్తారనే హామీ లేదని కబుర్లు చెప్పి మేఘాకు అప్పజెప్పారు. ఆ కంపెనీతో సిండికేట్ గా ఏర్పడిన మూడు కంపెనీలు మాత్రమే అర్హతలు లేకున్నాటెండర్స్ దక్కించుకొని దోచుకునే ప్రయత్నం చేశాయి. దీనిపై గుత్తేదారులు కోర్టును ఆశ్రయించగా.. అవకతవకలు నిజమేనని ఒప్పుకున్న ప్రభుత్వం టెండర్ ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.రూ.165 కోట్ల వరకు ఈ టెండర్ ఉంది.
మొన్నడ్యుయెల్ డెస్క్, ఫర్నీచర్ టెండర్ల విషయంలోనూ మేఘాకు చిక్కులు తప్పలేదు.టెండర్ల గోల్ మాల్ పై హైకోర్టులో విచారణ జరగగా..టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ అన్నీఒప్పేసుకుంది. దీంతో ఆ టెండర్లు రద్దయ్యాయి. తొలివెలుగు దెబ్బతో మేఘాకు, మంత్రి పుత్రరత్నానికి గూబ గుయ్ అంటోంది.మన ఊరు మన బడి టెండర్ల అవకతవకలపై ‘సొమ్ము జనానిది..సోకు మేఘాది!’ అంటూ తొలివెలుగు క్రైంబ్యూరో ముందు నుంచి కథనాలు ఇస్తోంది. మేఘా కంపెనీలోనే టెండర్ల రూపకల్పన జరిగిందని..తాజ్ హోటల్ లో బెదిరింపుల పర్వం..ఇలా అన్నింటినీ బట్టబయలు చేసింది.
మన ఊరు మన బడి కింద 26,065 పాఠశాలల్లో పెయింటింగ్, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు 3,41,265 డ్యూయల్ డెస్క్ లు, 26,065 స్కూళ్లలో టీచర్లు, హెచ్‌ఎంలకు టేబుళ్లు, కుర్చీలు, 1,39,585 గ్రీన్ చాక్ బోర్డుల సరఫరాకు తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రూ.1,539 కోట్లతో టెండర్లు పిలిచింది. తెలంగాణ ప్రభుత్వం రూ.8 వేల కోట్ల ఈ పథకాన్నిప్రవేశపెట్టింది.ఇలాంటి పథకాల్లో ఎంఎస్ఎంఈలకు 20 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుంది.కేంద్రంద 2004లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ..మేఘా కృష్ణారెడ్డి ఎవ్వరినీ కాదని ఒక్కడే అర్హత లేకున్నాటెండర్లు దక్కించుకున్నారు.అర్హత సాధించే కంపెనీలతో పొత్తు పెట్టుకుని వేల కోట్ల స్కాంకి తెరలేపారు.వారికంటే తక్కువ బిడ్డింగ్ వేసిన కంపెనీలకు టెక్నికల్ అర్హత లేదంటూ పక్కన పెట్టేలా చేశారు. దొంగ ఒప్పందాలతో మేఘా కంపెనీ వివిధ బడా సంస్థలతో పొత్తు పెట్టుకుని డ్రామాలాడుతోంది.ఈ దొంగచాటు వ్‌డవహారంపై సీబీఐకి సైతం ఫిర్యాదులు అందాయి.టెండర్లలో పాల్గొన్న ఓ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.ఇటీవల టెండర్ ప్రక్రియ కొనసాగింపుపై తుది నిర్ణయం తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.ఇదే క్రమంలో విద్యాశాఖ పిలిచిన టెండర్లపై కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ పెయింటింగ్ మినహా మిగిలిన మూడింటిపైనా పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో హైకోర్టులోనూ డ్యుయెల్ డెస్క్, ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డు టెండర్లలో అవకతవకలు జరిగాయని ఒప్పుకుంది ప్రభుత్వం.ఆ టెండర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. డ్యూయల్ డెస్క్ ల టెండర్ కోసం నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. తక్కువ ధరకు కోడ్ చేసినా..వారికి ఇవ్వకుండా ఫేక్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ పెట్టుకున్నకంపెనీకి ఎక్కువ ధరకు ఇచ్చేశారు. ఇందులో రెండింటికి మేఘాతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఇక ఫర్నీచర్ టెండర్ కు సంబంధించి ఐదు కంపెనీలు అర్హత సాధించాయి. కానీ..సిల్లీ రీజన్స్ తో టెండర్స్ లో పాల్గొన్న వారిని పక్కనపెట్టారు. మేఘాతో టైఅప్ అయిన కంపెనీలకే టెండర్ ఇచ్చేసింది కమిటీ.డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తామనే కంపెనీలకే వెల్ కమ్ పలికింది.