– మేఘా కబంధ హస్తాల్లోకి మరో ప్రాజెక్ట్
– దోచిపెడుతున్నటీఆర్ఎస్ సర్కార్
– ఏడున్నర వేల కోట్లలో కృష్ణార్పణం ఎంత..?
– మాకిస్తే సగం ఆదా చేస్తామంటున్నస్మాల్ ఇండస్ట్రీస్
– మిషన్ భగీరథ బాటలో..భారీ స్కాం!
– పేరుకే మన ఊరు-మన బడి.. డబ్బేమో ఆంధ్రాకి!
క్రైంబ్యూరో, తొలివెలుగు:మన ఊరు-మన బడి..అంటే మన పాఠశాలలను మరింత మెరుగైన సౌకర్యాలతో, హై టెక్నాలజీ సాయంతో విద్యార్థులకు బోధనను అందించటం. కేసీఆర్ చేపట్టిన పథకం ఉద్దేశం ఇదే. ఇందుకు విదేశాల్లో ఉండే బడాబాబుల నుంచి విరాళాల పేరుతో భారీగానే లాగేశారు.10 లక్షలు ఇస్తే.. క్లాస్ రూం బయట మీ పేరు పెడతాం.25 లక్షలు ఇస్తే..స్కూల్ కి మీ పేరు పెడతామని చెప్తూ.. డొనేషన్స్ వసూలు చేసేశారు. 3 యేళ్లలో ఈ ప్రాజెక్ట్ ని 7289 కోట్లతో పూర్తి చేయాలని భావించారు. అందుకు మొదటి దశలో 35 శాతం పాఠశాలలను ఎంపిక చేశారు. అంటే 9 వేల 123 స్కూల్స్ ని తీసుకు్నారు. ఈ స్కూల్స్ లో టాయిలెట్స్, అదనపు క్లాస్ రూమ్స్, ఉన్నవాటికి మరమ్మత్తులు,టీచర్లు, పిల్లలకు ఫర్నిచర్..డిజిటల్ ల్యాబ్స్ , లైబ్రరీ లాంటి సౌకర్యలు కల్పిస్తారు. అయితే లాభాలు లేని పనులను లోకల్ కాంట్రాక్టర్స్ కు ఇచ్చేలా..వివిధ పథకాల నుంచి డబ్బులు సమకూరేలా ప్లాన్స్ వేసుకున్నారు.
నాబార్డ్ నుంచి లోన్స్ కూడా తీసుకునేందుకు సిద్దమయ్యారు.అయితే ఈ పనినంతా స్మాల్, మీడియం ఇండ్రస్టీస్ కి ఇస్తే..ఉపాధి మెరుగు పడేది.చాల మంది చిన్న,మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన ఔత్సాహికులకు పని దొరికేది.కాని ఏకంగా మేఘా కృష్ణారెడ్డి లాంటి వారికే లాభం చేకూరేలా..ప్రాజెక్ట్ టెండర్లలో పాల్గొనేందుకు సైతం వారికి మాత్రమే అవకాశం ఉండేలా ఉత్తర్వులు జారీ చేశారని స్మాల్ ఇండ్రస్టీస్ సంఘం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్స్ కు మాత్రమే మేలు జరిగేలా చేయవద్దని వేడుకున్నారు.
ఇందులో మేఘా దోపిడీ ఎంత..?
జీ.వో. నెంబర్ 4తో మొత్తం 7289 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వివిధ రూపాల్లో ఉండే ఫండ్స్ అన్నింటిని వాడుకునేలా ఉత్తర్వులు ఇచ్చారు.కాని ఇప్పుడు..ఆ స్థాయిని మించి మేఘా మాత్రమే దోపిడీ చేసేలా పన్నాగం పన్నారు. తాము అనుకున్న ఆ ఒక్క సంస్థకే దక్కేలా టెండర్ల రూల్స్ మార్చారు. దీంతో ఒక్క దశలోనే వారికి మూడు వందల కోట్లు సమకూరే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. అటు.. సామాగ్రి అంతా..ఒకే వద్ద చేయించి..మోసాలకు పాల్పడే అవకాశాలు లేకపోలేదని ఆరోపణలు వస్తున్నాయి. చేసే పనుల్లో నాణ్యత దెబ్బతినే అవకాశాలు ఉంటాయని విమర్శలు ఉన్నాయి.
మిషన్ భగీరథ దొపిడీ..కంటిన్యూ..!
ఇంటింటికీ నీళ్లు ఇవ్వంది ఓట్లు అడగనని మొదటి ధపా ఎన్నికల్లో చెప్పిన కేసియార్ సర్కార్..43 వేల కోట్లతో మిషన్ భగీరథ ప్రాజెక్ట్ చేపట్టింది.అయితే ఇందులో భారీగా స్కాం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. పైపుల తయారీ మొదలుకొని..వాటిని వేసేందుకు తవ్విన రోడ్ల వరకు, ఆ తర్వాత ట్యాంకుల నిర్మాణం దాకా ..ఒకే గుత్తేదారుడికి ఇచ్చారు. వారికి అనుకూలమైన వారికి సబ్ కాంట్రాక్ట్ లు ఇచ్చుకుని కోట్లు గడిస్తూ.. బ్లాక్ మనీని వైట్ గా మార్చేశారనేది బహిరంగ రహస్యం. ఆ తర్వాత విదేశాల్లో అన్ అకౌంటబుల్ అమౌంట్ ను దాచిపెడుతారనీ ఆరోపణలున్నాయి. అందుకే మళ్లీ వేల కోట్ల విలువ చేసే మన ఊరు మన బడి పేరుతో మరో స్కామ్ కు తెరలేపినట్టు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.