ఉదయం నుంచి ఓ వార్త సమంత అభిమానులను కంగారు పెట్టిస్తోంది. ఆమె తీవ్ర అనారోగ్యం పాలయ్యారని.. కడపలో జరిగిన కార్యక్రమానికి వెళ్లి వచ్చాక కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురయ్యారని.. తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో సమంత మేనేజర్ స్పందించారు.
ప్రస్తుతం సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు ఆమె మేనేజర్. ఆదివారం కొంచెం దగ్గు ఉండటంతో AIG హాస్పిటల్ లో టెస్ట్ చేయించుకుని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని కోరారాయన.