ఎమ్మార్వో హత్య పై తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. నేను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. విజయారెడ్డి హత్య తనను కలచివేసిందని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్ రెడ్డి రంగారెడ్డి ఆయన సోదరులు రాజకీయంగా ఎదుర్కోలేక శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.నాపై మూడుసార్లు ఓడిపోయిన వ్యక్తి అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
మల్ రెడ్డి సోదరులు దొంగే .. దొంగా అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో మల్ రెడ్డి చాలా భూములు కబ్జా చేశారని ఆరోపించారు.వీటిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నిందితుడు సురేష్ కుటుంబ సభ్యుల నుండి మల్ రెడ్డి కుటుంబ సభ్యులు భూమి కొన్నారని ఆరోపించారు. ఇద్దరు ముస్లింలపై టెనెంట్ చేయించి వారి నుండి మల్ రెడ్డి కుటుంబ సభ్యులు 16 ఎకరాల భూమిని కొన్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. విజయారెడ్డి హత్యకు కారణమైన 412 ఎకరాల భూమి ఎవరెవరిపై ఉన్నాయో విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.నా ఆరోపణలు చేయడం కాదు..దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు కిషన్ రెడ్డి.