– నార్సింగ్ మంచిరేవుల పార్టీలో డ్రగ్స్..?
– కానీ.. తెరపైకి పేకాట మాత్రమే..
– బంగారు తెలంగాణలో బడాబాబులకో రూలా?
– ఇలా అయితే డ్రగ్స్ ఫ్రీ సిటీ అయ్యేది ఎప్పటికి..?
వారంతా పేరు మోసిన రియల్ వ్యాపారులు. తరచూ ఫ్రీ లాంచ్ అంటూ సామాన్యుల నుంచి డబ్బులు లాగుతుంటారు. తీరా వచ్చిన డబ్బుతో వాళ్లు చేస్తోంది ఏంటయ్యా అంటే పేకాట ఆడడం. అదివారం రాత్రి ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో చాలామంది పేకాట ఆడుతూ దొరికిపోయారు. మొత్తం 30 మందిలో 25 మంది వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీలకి చెందిన బడాబాబులే ఉన్నారు.
పేకాటతో పాటు వీకెండ్ పార్టీలో డ్రగ్స్ కూడా సేవిస్తున్నారని పోలీసులకు సమాచారం ఉంది. డ్రగ్స్, గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతున్న ఈ సమయంలో… సమాచారం రావడంతో వెంటనే అక్కడ వాలిపోయారు పోలీసులు. వాసవి డెవలపర్స్ పార్ట్నర్ రాజారాంతో పాటు రియల్ బ్రోకర్, గతంలో చీటింగ్ కేసుల్లో అరోపణలు ఎదుర్కొంటున్న మద్దుల ప్రకాశ్ వీరందరినీ సమావేశానికి పిలిచినట్లు తెలుస్తోంది. అతనిపై నమ్మకంతో అక్కడకు వచ్చారంతా. కానీ గెస్ట్ హౌజ్ లో డ్రగ్స్ దందా కూడా జరుగుతుందని తెలిసింది. అదే సమయంలో పోలీసులు రావడంతో బడాబాబులంతా ఇరుక్కుపోయారు.
ఫ్రీ లాంచ్ పేరుతో డబ్బులు వసూలు చేసి కోట్లకు పడగలెత్తే రియల్ వ్యాపారులంతా పేకాట ఆడుతూ దొరికిపోయారు. టేబుల్ రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.15 కోట్ల వరకు చేతులు మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాసినో కాయిన్స్ ద్వారానే డబ్బులు చేతులు మారినట్లు గుర్తించారు. అయితే డ్రగ్స్ విషయాన్ని బయటకు పొక్కకుండా కేవలం పేకాటను మాత్రమే తెరపైకి తెచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు గుత్తా సుమన్ కుమార్, హీరో నాగశౌర్య బాబాయ్ బుజ్జి, రాజారాం, మద్దుల ప్రకాశ్ పేర్లు బయటకు వచ్చాయి.