సన్ ఆఫ్ ఇండియా సినిమా విడుదలైనప్పటి నుండి మంచు ఫ్యామిలీ పై ట్రోలింగ్ రెట్టింపు అయ్యింది. ప్రతి చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా ట్రోల్స్ చేస్తూ వందల వీడియోలను పబ్లిష్ చేస్తున్నారు.
దీనితో మంచు ఫ్యామిలీ చట్టపరమైన చర్యలు తీసుకోటానికి సిద్ధం అయ్యారు.అలాగే మరోవైపు మంచు మోహన్ బాబు, విష్ణు అభిమానుల అధికారిక సంఘం “స్టేట్ మంచు యువసేన” ఇటీవల చాలా యూట్యూబ్ ఛానెల్స్ పై ఫిర్యాదు చేసింది.
సన్ ఆఫ్ ఇండియా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుండి, కొంతమంది ట్రోలర్లు మోహన్ బాబు , విష్ణు, లక్ష్మిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారని విడుదలకు ముందే సినిమా తడిసిమోపెడు అయిందని ప్రచారం చేయడంతో ప్రేక్షకులు థియేటర్లలోకి రాలేదు అని మంచు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రవర్తి అన్నారు.
ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదని మీరు చెప్పలేరు. వారిపై వ్యక్తిగతంగా దాడి చేసి హేళన చేయలేరు, మంచు కుటుంబం గురించి అసత్యాలు ప్రచారం మాత్రం చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు చక్రవర్తి.