మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మి, మనోజ్, విష్ణు దంపతులు సతీసమేతంగా ప్రధాని మోడీని కలిశారు. ఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో 40నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో మంచు లక్ష్మి కోరికకు ప్రధాని ఓకే అన్నట్లు తెలుస్తోంది.
గతంలో బాలీవుడ్ స్టార్స్‌కు ప్రధాని విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో సౌత్ స్టార్స్‌కు పిలుపు రాలేదని కొందరు, సౌత్‌ను పట్టించుకోలేదని మరికొందరు ఆరోపణలు చేశారు. దీంతో సౌత్ స్టార్స్ కోసం ఒక రోజు సమయమివ్వాలని మంచు లక్ష్మి ప్రధాని మోడీని కోరాగా… అందుకు మోడీ ఓకే చెప్పినట్లు సమాచారం. అంతేకాదు మీరే అందరితో కో-ఆర్డినేట్ చేయండి, నేను సమయమిస్తాను అని చెప్పినట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో సౌత్ స్టార్స్‌తో ప్రధాని విందు ఉండబోతుంది.
Advertisements