• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » Tollywood » విషయం చెప్పేసిన మంచు మనోజ్‌!!

విషయం చెప్పేసిన మంచు మనోజ్‌!!

Last Updated: January 20, 2023 at 12:25 pm

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన కొత్త సినిమాని ప్రకటించాడు. గత కొంత కాలంగా ఈ హీరో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో మంచు మనోజ్ సినిమాలకి బ్రేక్ ఇచ్చేశాడు అంటూ వార్తలు వినిపించాయి. భూమా మౌనిక రెడ్డికి దగ్గర అవ్వడంతో మనోజ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ గుసగుసలు కూడా వినిపించాయి. అయితే ఆ వార్తలు అన్ని అవాస్తం అని తెలిపేలా ఈ హీరో తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు.

మంచు మనోజ్ చివరిగా ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2017 లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయింది. ఆ తరువాత రెండు సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించి అలరించాడు. అయితే మనోజ్ పూర్తీ స్థాయిలో హీరోగా కనిపించి దాదాపు 5 ఏళ్ళు అయ్యిపోతుంది. తాజాగా ఒక క్రేజీ టైటిల్ తో తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు.

ఈ చిత్రానికి ‘వాట్ ది ఫిష్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ టైటిల్ కి ‘మనం మనం బరంపురం’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో చుట్టూ గ్యాంగ్ స్టార్స్ ఉంటే మధ్యలో మంచు మనోజ్ నుంచి ఉన్న దృశ్యం కనిపిస్తుంది.ఇక ఈ పోస్టర్ లో ‘ఏ ఫిలిం బై వి’ అని ఉంది. దర్శకుడు ఎవరనేది సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా క్రేజీ టైటిల్ తో ఆడియన్స్ లో సినిమా పై ఆసక్తి కలిగేలా చేసుకున్నాడు మనోజ్.

నిజానికి ఈ హీరో నుంచి అభిమానులు కోరుకునేది ఇలాంటి క్రేజీ సినిమాలే. కానీ మనోజ్ గత కొన్ని చిత్రాలు నుంచి అన్ని సీరియస్ మోడ్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తో వస్తున్నాడు. కాగా ఈ మూవీతో పాటు ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవల ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

It's been a long time since I did any film but I’m blessed to have had all your love upon me all these years and it’s high time to give back all the Love ❤️

Here’s Announcing my NEXT❤️🚀 #WhatTheFish 🤪🥸🤩🥳😎💫

A crazy film that’ll give you all a CRAZYYYYY experience 🙂 pic.twitter.com/tUx7SofoRu

— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 20, 2023

Primary Sidebar

తాజా వార్తలు

మోసం చేసిపోతారని ఎన్నడూ అనుకోలేదు!

సువాసనలు వెదజల్లే బాంబు.. ముట్టుకుంటే అంతే సంగతులు !

కేసీఆర్ ను వదలనంటూ.. కోర్టుకెక్కిన పాల్..!

అందుకే అదానీ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చాం….!

ఎన్నికల వేళ హల్ చల్ చేస్తున్న ఆడియో, సీడీలు…!

ముక్కు నేలకు రాస్తా.. బీఆర్ఎస్ కు ఈటల సవాల్..!

సంక్షోభ సమయంలో ఇంటెల్ వినూత్న నిర్ణయం…!

ఆదేశాలు వస్తే.. పోటీ చేసేందుకు సిద్ధమే!

డ్రైనేజీ పనులు చేస్తుండగా గోడ కూలి ఇద్దరు మృతి!

ఓరి వీడి భయం బంగారం గానూ…అమ్మాయిల్ని చూసి..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

కేసీఆర్ కు షూ చూపిస్తూ షర్మిల సవాల్

ఫిల్మ్ నగర్

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap