నగరంలో లో అత్యాచారం హత్యకు గురికాబడిన గిరిజన బాలిక కు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆ కుటుంబాన్ని సినీ హీరో మంచు మనోజ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక క్రూరత్వం. పాప తల్లి నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఒక చేతకాని వాడిలా అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు. మహిళలకు, పిల్లలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కరు కూడా నేర్పించాలని అన్నారు. అలాగే ఈ ఘోరం జరిగి ఆరు రోజులు అవుతున్నా ఇంకా అన్ని ఆ నీచుడి జాడ దొరకలేదు. పోలీసులు కూడా కష్ట పడుతున్నారు. అలాగే ప్రజలు ప్రభుత్వం, పోలీసు వారు అందరూ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు మనోజ్. ప్రతి ఏరియా లో కూడా జల్లెడపట్టి వాడిని పట్టుకోవాలన్నారు.
టీవీ ఛానల్ ఆన్ చేస్తే సాయి ధరమ్ తేజ్ అలా పడ్డాడు సాయి ధరమ్ తేజ్ ఇలా పడ్డాడు అంటూ త్రీడీ చేసి చూపిస్తున్నారు తప్ప… ఈ విషయం గురించి ఎవరు చూపించడం లేదని మీడియాపై మండిపడ్డారు. ప్రతీ మీడియా ఛానల్ కూడా ఈ విషయాన్ని టీవీలలో చూపించాలని కోరారు.