గత కొంత కాలంగా మంచు మనోజ్ పెళ్లి పై అనేక రకాలు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది గణేష్ ఉత్సవాల్లో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డితో కలిసి పూజలు నిర్వహించడంతో వీరిద్దరి పెళ్లి వార్తలు తెర పైకి వచ్చాయి. అయితే ఈ వార్తలు పై మంచు మనోజ్ గాని, ఇరువురి కుటుంబాలు గాని ఎక్కడ నోరు విప్పలేదు. ఇక రెండు రోజులు నుంచి వీరిద్దరూ మార్చి 3న పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన బయటకి రాలేదు.
తాజాగా మంచు మనోజ్ అధికారికంగా తన పెళ్లి వార్తని కన్‌ఫార్మ్ చేశాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా భూమా మౌనిక రెడ్డి ఫోటో షేర్ చేస్తూ.. ‘పెళ్లికూతురు భూమా మౌనిక రెడ్డి. మనోజ్ వెడ్స్ మౌనిక’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో వీరిద్దరి పెళ్లి వార్త అధికారికంగా నిజం అయ్యింది. శుక్రవారం రాత్రి మంచు లక్ష్మి ఇంట్లో వీళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.
ఇప్పటికే మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరగ్గా గురువారం సంగీత్‌ను సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించి మెహందీతో పాటు డెకరేషన్ పిక్స్ షేర్ చేసింది మంచు లక్ష్మి..దీంతో, మనోజ్ రెండోపెళ్లి వార్తలపై క్లారిటీ వచ్చినట్లయ్యింది.
ఇక పోస్ట్ చూసిన నెటిజెన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరిద్దరి వివాహంతో మంచు, భూమా కుటుంబాలు ఒక్కటవ్వడంతో సినీ, రాజకీయ రంగాల్లో చర్చనీయాంశం అయ్యింది. కాగా మనోజ్, మౌనికలకు గతంలోనే విడివిడిగా వివాహం అయ్యింది. అయితే ఇద్దరు విడాకులు తీసుకోని మొదటి పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరికి ఇది రెండో పెళ్లి.
Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023