మంచు వారి అబ్బాయిలు విష్ణు , మనోజ్ మధ్య విభేదాల నేపథ్యంలో ఇద్దరు కూడా వార్తలొకెక్కారు. ఆ గొడవ గురించి అటు తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు స్పందించి వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని..ఇది చాలా సర్వసాధారణమైన చిన్న గొడవ అని పేర్కొన్నారు. మనోజ్ మాత్రం ఎక్కడ తన వివరణ ఇవ్వలేదు.
తాజాగా మంచు మనోజ్ రియల్ స్టార్, దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాన్ష్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సందడి చేశారు. ఈ సందర్భంగా తన బుజ్జి తమ్ముడి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానని మనోజ్ చెప్పారు. ‘వాట్ ద ఫిష్’ అనే చిత్రంతోపాటు త్వరలోనే తాను ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
‘‘కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మాకొక సంతోషకరమైన జీవితాన్నిఇస్తారని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘నాకు సినిమానే లైఫ్. మీరే నా జీవితం. సినిమా లేకపోతే నాకేమీ లేదు. మళ్లీ సినిమాకే వస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. .ఈ సందర్భంగా విలేకర్లు కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న గొడవ గురించి ప్రశ్నించగా మనోజ్ స్పందించలేదు.