మంచు సోదరులు విష్ణు, మనోజ్ మధ్య వివాదం రోడ్డున పడింది. అసలేం జరిగిందనేది పూర్తిగా తెలియలేదు కానీ.. విష్ణు మంచు మాత్రం మనోజ్ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టాడు. తన మనిషి అయిన సారథి అనే వ్యక్తిపై విష్ణు దాడి చేయటానికి వచ్చాడంటూ మనోజ్ తెలియజేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోను మనోజ్ తీశాడు. అదిప్పుడు మీడియా కంటపడటంతో తెగ వైరల్ అవుతుంది.
గత కొన్నాళ్లుగా విష్ణు, మనోజ్ మధ్య మనస్పర్దలు ఉన్నాయి. ఇద్దరూ ఏమంటే ఏమని అనుకుంటున్నారు. కానీ దూరం మాత్రం అలాగే ఉంది. ఇటీవల మంచు మనోజ్ పెళ్లి భూమా మౌనికతో జరిగింది. అది కూడా లక్ష్మీ మంచు ఇంట్లోనే జరిగింది. ఆ పెళ్లికి మోహన్ బాబు, విష్ణు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అయితే విష్ణు అతిథిలా వచ్చి వెళ్లిపోవటం హాట్ టాపిక్‌గా మారింది.
మంచు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు సారథి అనే వ్యక్తి. ఈ మధ్య మంచు మనోజ్‌కు ఆయన మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలో సారథి ఇంటికెళ్లి అతన్ని కొట్టబోయాడు మంచు విష్ణు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోను విడుదల చేశాడు మనోజ్. విష్ణు తరచూ ఇలా చేస్తున్నాడంటూ మనోజ్ కామెంట్ చేశారు. మేమేమైనా ఊరికే ఇచ్చామా, తీసుకున్నామా అంటూ ఆ వీడియోలో మాటలు వినిపిస్తున్నాయి. కాగా మంచు మనోజ్.. తాజాగా డయల్ 100కి కాల్ చేశాడు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్తున్నారు. మనోజ్, విష్ణుపై కేసు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది
ఇంత కాలం నాలుగు గోడలు మధ్య ఉన్న ఈ వివాదం ఇప్పుడు బయటకు వచ్చింది. నా వాళ్లపై విష్ణు దాడి చేస్తున్నాడంటూ మనోజ్ పేర్కొన్నారు. అంతే కాకుండా మనోజ్ ఈ విషయాన్ని వీడియో మనోజ్ తన ఫేస్ బుక్ స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వీడియో గమనిస్తే అందులో ‘నా ఇష్టం’ అని విష్ణు అంటున్నాడు. మరో వైపు ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’ అంటూ మరో వైపు మనోజ్ అంటున్నాడు. అసలు వీరి మధ్య గొడవేంటో తెలియాల్సి ఉంది.
అయితే విష్ణు ఉన్న రూమ్ తలుపులు కొడుతున్న దెవరు? అసలు విష్ణుతో వాగ్వాదం చేస్తున్నదెవరు? మనోజ్ ఎక్కడి నుంచి వీడియోను తీశారనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.