మా అసోసియేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. కాగా నేడు మంచు విష్ణు అలాగే… ప్యానెల్ సభ్యులు మధ్యాహ్నం నామినేషన్లు వేయనున్నారు. సోమవారం ప్రకాష్ రాజ్ అలాగే ప్యానెల్ సభ్యులు, సివిఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ నామినేషన్లు వేశారు.
ఈ రోజు మంచు విష్ణు, అతడి ప్యానెల్ సభ్యులు నామినేషన్ వేయనున్నారు. మా అధ్యక్ష, జనరల్ సెక్రెటరీ పదవులకు గాను ఈ సారి త్రిముఖ పోటీ నెలకొంది. జనరల్ సెక్రెటరీ పదవికి జీవిత, రఘుబాబు, బండ్ల గణేష్ పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్, విష్ణు, సివియల్ నరసింహారావు పోటీలో ఉన్నారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.