కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యం లో భారతీయుల ఐక్యమత్యం చాటిచెప్పాలంటు ఏప్రిల్ 5న దేశ వ్యాప్తంగా ప్రజలంతా దీపాలు వెలిగించాలని కోరిన సంగతి తెలిసిందే. రాత్రి 9 గంటలకు విద్యుత్ బల్బులను ఆపివేసి.. దీపాలను, టార్చ్‌లను వెలిగించారు. కొంతమంది ఆకతాయిలు మాత్రం పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. ఈ బాణాసంచా కాల్చడం వల్ల జరిగిన భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇదే విషయమై మంచు మనోజ్ స్పందిస్తూ బాణాసంచాలు కాల్చిన వారిపై మండిపడ్డారు.
‘ఈ క్రాకర్స్ చూస్తే.. మనవాళ్లు కరోనాని కూడా సీఎం లేదా పీఎం చేస్తారనుకుంటా.. ఓరి దీనమ్మా బతుకు.. మళ్లీ జై కరోనా అంట’ అంటూ ఫైర్ అవుతూ ట్వీట్ వదిలారు. ‘రేయ్ ఇడియట్స్.. ఆ క్రాకర్స్ కాల్చడం ఆపండ్రా.. మనం మనుషులే తప్ప మూర్ఖులం కాదు.. క్రాకర్స్ కాల్చమని మిమ్మల్ని ఎవరూ అడగలేదు.. జి బలిసిన చదువుకున్న వాళ్లు మాత్రమే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారు’ అంటూ ఫైర్ అయ్యారు.
Massive fire in a building in my neighborhood from bursting crackers for #9baje9mintues. Fire brigade just drove in. Hope everyone's safe. pic.twitter.com/NcyDxYdeFW
— Mahim Pratap Singh (@mayhempsingh) April 5, 2020