నటుడు మంచు మనోజ్ తన సినీ కెరీర్‌ను దొంగ దొంగది చిత్రంతో శుభారంభం చేసినా అతనికి ఇటీవలి కాలంలో సినిమాలు ఏవీ కలసి రావడం లేదు. పలు హిట్ చిత్రాలు తన ఖాతాలో ఉన్నప్పటికీ అతను చివరిసారిగా చేసిన 4 చిత్రాలు ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో అతని కెరీర్‌కు కొద్దిగా ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ మనోజ్ ఏమాత్రం దిగులు చెందలేదు. పైగా బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యాడు.
వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ మంచు మనోజ్ స్టార్ నటుడి కుమారుడు కనుక అతనికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే భారీ కాయంతో ఉన్నావని కొందరు అతన్ని ట్రోల్ చేసే సరికి అతను బరువు తగ్గాడు. మొత్తం 15 కిలోల బరువు తగ్గినట్లు అతనే స్వయంగా వెల్లడించాడు. ఇక బరువు తగ్గేందుకు మనోజ్ నిత్యం ఆయుర్వేదిక్ డైట్‌ను పాటించినట్లు తెలిసింది. అలాగే నిత్యం జిమ్‌లో గంటల తరబడి వర్కవుట్లు కూడా చేశాడని సమాచారం. ఈ క్రమంలోనే అతను బరువు తగ్గిన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
కాగా మరోజ్ నిర్మాతగా మారి అహం బ్రహ్మాస్మి అనే మూవీని ఈ ఏడాది ఆరంభంలో నిర్మించాడు. ఈ క్రమంలో బరువు తగ్గాక రెండు సినిమాలకు సంతకం చేశాడు. ఓ తెలుగు డైరెక్టర్‌తో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని, మరో తమిళ డైరెక్టర్ తో మరో ద్విభాషా చిత్రాన్ని అతను చేస్తున్నాడు. అయితే అతని వరుస సినిమాలు ఫ్లాప్‌లుగా మారిన నేపథ్యంలో ఇకపై వచ్చే సినిమాలు అయినా మనోజ్‌కు మంచి బ్రేక్ ఇస్తాయా, లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.