సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వాలెంటైన్ వీక్ సందర్బంగా విడుదల చేయనున్నారు. ఆయన సినిమా పేరును ఉటంకిస్తూ సాయి తేజ్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఓ ఫిలాసఫీ కూడా చెప్పుకొచ్చాడు మనోడు. తన సోలో బ్రతుకును బాగా నడిపిస్తున్నానని.. తన లాగే సోలోగా జీవితాన్ని గడిపేవారు ఆ జీవితం ఎలా ఉంటుందో చెప్పాలని ట్వీట్ చేశాడు. సోలో లైఫ్ ఎందుకు బెటరో ఒక్కొక్కటిగా సాయి తేజ్ చెప్పుకొచ్చాడు.
1. ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే నేను పెద్దగా టెన్షన్ పడను.
2. రెస్టారెంట్‌కి వెళ్తే నా ఫుడ్‌కి మాత్రమే నేను పే చేస్తాను. (వాలెట్‌కి బొక్క పడే ఛాన్సే లేదు)
3. క్రికెట్ ఆడేటప్పుడు కాల్ వచ్చి గేమ్ మధ్యలో వెళ్లాల్సిన పని నాకు లేదు.
4. షూట్, క్రికెట్, జిమ్, హోమ్, ఫ్రెండ్స్ – నాకు నచ్చినంత టైమ్ నాకు నచ్చిన వాటితో గడపవచ్చు.
ఇక సాయి తేజ్ ట్వీట్ కు మంచు విష్ణు తనదైన శైలిలో రీట్వీట్ చేశాడు. మై లిటిల్ బ్రదర్ సాయి ధరమ్ తేజ్. ఈ ట్వీట్ నేను సేవ్ చేసుకున్నా. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తా.. అని విష్ణు సరదాగా రిప్లై ఇచ్చాడు. కాగా మంచు విష్ణు ట్వీట్ కు సాయి తేజ్ కూడా రిప్లై ఇచ్చాడు. ‘‘హహహహ.. విష్ణు అన్న మీలాగే అందరికీ అదృష్టం ఉండాలిగా అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వారిద్దరి సరదా సంభాషణ మీరు కూడా చుడండి.
Hahahahaha Vishnu anna not everyone is as lucky as you kadha ☺️
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 8, 2020