సన్నీ లియోన్ సెట్స్ పైకొచ్చినప్పట్నుంచి మంచు విష్ణు సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. సన్నీతో సెక్సీ గేమ్స్ ఆడుతూ ఓసారి, ఆమెను టీజ్ చేస్తూ మరోసారి, సెల్ఫీలు దిగుతూ చాలా సార్లు.. ఇలా ఎప్పటికప్పుడు హడావుడి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడీ సెట్స్ లోకి పాయల్ రాజ్ పుత్ కూడా రావడంతో.. ఇద్దరు హీరోయిన్లతో కలిసి విష్ణు చేసే అల్లరి మరీ ఎక్కువైంది. ఈ క్రమంలో ఇద్దరు హీరోయిన్ల చేతిలో దెబ్బలు తిన్నాడు ఈ హీరో.
తాజాగా సన్నీలియోన్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో పాయల్ ఓ చోట కూర్చుంటుంది. అప్పుడే విష్ణు అటుగా వస్తాడు. నీకు ఎవరంటే ఇష్టం అనే ప్రశ్న ఎదురౌతుంది. ఇంకెవరు పాయల్ అంటూ సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత సన్నీ లియోన్ ఎదురవుతుంది. నీకు ఎవంటే ఇష్టం అంటూ మళ్లీ అదే ప్రశ్న. ఈసారి సన్నీ లియోన్ పేరు చెబుతాడు విష్ణు.
అయితే ఈసారి ఇద్దరు హీరోయిన్లు ఒకే చోట ఉంటారు. అప్పుడు సేమ్ క్వశ్చన్ విష్ణుకు ఎదురౌతుంది. దీంతో ఎవరి పేరు చెప్పాలో అర్థం కాక, ఫైనల్ గా అలియాభట్ పేరు చెప్పేస్తాడు విష్ణు. దీంతో ఇద్దరు హీరోయిన్లకు కోపం వచ్చి విష్ణుపై దాడికి దిగుతారు. దిండుతో విష్ణును వెంటాడుతారు.
ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాలి నాగేశ్వరరావు సినిమా షూటింగ్ గ్యాప్ లో ఇలా హీరోహీరోయిన్లంతా ఎప్పటికప్పుడు సరదాగా గడుపుతూ ఆ వీడియోల్ని పోస్ట్ చేస్తున్నారు. పనిలోపనిగా సినిమాకు తెగ ప్రచారం కల్పిస్తున్నారు.
Lesson learnt!!
Never lie to these pretty ladies @SunnyLeone & #PayalRajput 🤫#Wednesday #Wednesdayvibes pic.twitter.com/ue22flZAM3— Vishnu Manchu (@iVishnuManchu) May 11, 2022