పెద్దల జోక్యంతో సైలెంట్ అయిన మా ఎన్నికల వివాదం.. మళ్లీ రాజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా హీరో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించి ఓ వీడియో విడుదల చేశాడు. త్వరలోనే ‘మా’ కల నెరవేరుతుందని చెప్పాడు. శాశ్వత భవనం కోసం మూడు స్థలాలను చూశానని.. అసోసియేషన్ తో చర్చల అనంతరం వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసి… భవనం నిర్మిస్తామని తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను విడుదల చేశాడు విష్ణు.
Good morning to my MAA family 💪🏽❤️ pic.twitter.com/6j8LddFuRG
— Vishnu Manchu (@iVishnuManchu) August 21, 2021
Advertisements
కొన్నాళ్లుగా ‘మా’ ఎన్నికలపై వివాదాలు నడుస్తున్నాయి. ముందుగా అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు. తర్వాత ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావులు పోటీలో తాము ఉంటున్నట్లు చెప్పారు. అయితే కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.