ప్రస్తుతం టాలీవుడ్ దర్శకులు ఎక్కువగా రీమేక్ లవైపు దృష్టి పెడుతున్నారు. ఒక బాషాలో హిట్ అయిన సినిమాను మిగిలిన భాషల్లో రీమేక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ వార్త ఫిలింనగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మలయాళం లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా “అయ్యప్పనుంకోశీయం” ఈ సినిమాను నిర్మాత సూర్య దేవర వంశీ తెలుగులో రీమేక్ చెయ్యాలని భావిస్తున్నాడట. ఈ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూమీనన్ ల కెరీర్ లో అతి పెద్ద విజయంగా నిలిచింది.
ఈ సినిమాలో కీలక పాత్రలు రెండు ఉండగా అందులో ఒకదానికి బాలకృష్ణ ను, మరొకదాన్ని మంచు విష్ణును అని అనుకుంటున్నాడట నిర్మాత. అయితే బాలకృష్ణ ఇదివరకే మంచు వారసుడు మంచు మనోజ్ తో ఊ..కొడతారా ఉలిక్కిపడతారా సినిమాలో చేసిన విషయం తెలిసిందే. బాలయ్యకు మంచు ఫ్యామిలీతో మంచి సత్సంబంధాలు ఉండటంతో వీరిద్దరూ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటారు అంటూ ఫిలింనగర్ లో గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరు ఒప్పుకుంటారా, ఒప్పుకుంటే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది తెలియాలంటే వేచి చూడాలి.