ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. తాడేపల్లి జగన్ నివాసానికి వెళ్లిన విష్ణు ఆయనతో కలసి భోజనం చేశారు. అనంతరం సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై జగన్ తో చర్చించారు.
సినిమా టిక్కెట్ల ధరల పెంపు అంశం ఆన్ లైన్ టికెటింగ్ తదితర అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం మీడియా ముందుకు వచ్చిన విష్ణు తను మర్యాదపూర్వకంగానే సమావేశమైనట్లు చెప్పుకొచ్చారు.
సీఎం జగన్ ను కలవడం ఇది మూడో సారన్నారు. నాకు వరుసకు బావ అవుతారు. అయినా అన్న అని పిలుస్తాను. ఇవాళ కలిసింది పూర్తిగా పర్సనల్ విజిట్. నేను తిరుపతిలో స్టూడియో లు కడతాను. రెండు తెలుగు రాష్ట్రాలు మాకు కావాలి. తెలంగాణ,ఆంధ్రా రెండు కళ్లు. విశాఖలో అవకాశాల కోసం ఫిల్మ్ ఛాంబర్లో చర్చిస్తాం. మొన్న జరిగిన చర్చల్లో మిస్ కమ్యూనికేషన్ జరిగింది.
నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది. అయినా ఆయనకు అందజేయలేదు. పేర్ని నాని తో సమావేశం పై ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేసింది. నాకు అన్ని పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారు. టీడీపీలో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారు. పేర్ని నాని మా ఇంటికి వస్తే ఏదో కారణాలు చెప్తూ ప్రచారం చేశారు.
మాకు సపోర్ట్ లేకపోతే మా ప్రెసిడెంట్ గా ఎలా గెలుస్తాను. అందరినీ చిత్తు చిత్తుగా ఓడించాను. నాన్న గారికి ఇన్విటేషన్ అందకపోవడం పై ఫిల్మ్ ఛాంబర్ లో చర్చిస్తాం. ప్రభుత్వం ఇన్విటేషన్ పంపినా నాన్న గారికి అందజేయలేదు.
ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ నాన్నగారు. ఎవరు ఇలా చేశారో మాకు తెలుసు. ఎలా కరెక్ట్ చేయాలో మేము ఆలోచిస్తాం. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక కుటుంబం. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు.అవన్నీ పరిష్కరించుకుంటామన్నారు విష్ణు.
ఇదిలా ఉండగా గత వారం మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు జగన్ తో భేటీ అయ్యారు.
అనంతరం సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తో మోహన్ బాబు కూడా భేటీ అయ్యారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ చుట్టూ కూడా ఏపీ రాజకీయాం నడుస్తుంది.