మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు మంగళవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలవనున్నారు. ఇప్పటికే విజయవాడ తాడేపల్లికి చేరుకున్న విష్ణు .. సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై మంచు విష్ణు చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. మా చైర్మన్‌గా విజయం సాధించాక సీఎం జగన్‌తో విష్ణు భేటీ కావడం ఇదే తొలిసారి.
ఇక ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ గత వారం ఏపీ సీఎంతో సమావేశమై టిక్కెట్ ధరలు తదితర అంశాలపై చర్చించారు.
మరి మంచు విష్షు జగన్ తో ఏం మాట్లాడబోతున్నారో చూడాలి. అయితే మొన్ననే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఇంటికి ఆహ్వానించారు విష్ణు, మోహన్ బాబు. అందుకు సంబంధించిన విష్ణు చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా కూడా మారింది.