మంచు మోహన్ బాబు వారసుల్లో ఒకడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు విష్ణు. విష్ణు ప్రస్తుతం మోసగాళ్లు అనే సినిమా చేస్తున్నాడు. తెలుగు , ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆ ఐటి స్కామ్ ఏంటి.. ఎవరు చేశారు.. ఎలా చేశారు.. ఎందుకు చేశారు.. దాని వలన ఎవరికీ లాభం వచ్చింది..స్కామ్ ఎలా బయటకు వచ్చింది అనేది ఈ సినిమా కథ.
మరో వైపు సినిమాల నిర్మాణంలో కూడా స్పీడు చూపిస్తున్నాడు మంచు విష్ణు. వెబ్‌సిరీస్ ఒకటి ‘చదరంగం’ పేరుతో ఇప్పటికే విడుదలైంది. కొన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇవి కాకుండా లిమిటెడ్ బడ్జెట్‌లో విష్ణు మరో నాలుగు లో బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేశారట. ఒకవేళ ఓటీటీలో విడుదల చేసినా తన పెట్టుబడి తనకు వచ్చేలా విష్ణు ప్లాన్ చేశారని టాక్. ఈ నాలుగింటిలో ఓ చిత్రంలో ప్రియదర్శి హీరోగా నటించనుండగా మిగిలిన మూడు చిత్రాల్లో కొత్తవాళ్లు హీరో హీరోయిన్లుగా నటిస్తారని సమాచారం.