మంచు ఫ్యామిలీ పిల్లలను టార్గెట్ చేసుకున్నట్లు కనపడుతోంది. ఇప్పటికే స్కూల్స్ నడుపుతూ… విద్యాసంస్థల బిజినెస్ చూసుకుంటున్న మంచు విష్ణు ఫ్యామిలీ… ఇప్పుడు చిన్న పిల్లలకు సంబంధించిన ఫ్యాషన్ స్టోర్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు భార్య విరానికా తన పిల్లల పేరుతో కిడ్స్ ఫ్యాషన్ స్టోర్‌ను మొదలుపెట్టబోతున్నారు. మే చివరి వారంలో మొదలుకాబోతున్నట్లు తెలుస్తోంది.
అతి త్వరలోనే ఈ బ్రాండ్ పేరును అనౌన్స్ చేయటంతో పాటు దేశవ్యాప్తంగా ఈ స్టోర్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. సరికొత్త డిజైన్స్‌తో వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్.