మంచు ఫ్యామిలీ ఇంట ఓ వీడియో హీట్ రాజేసింది. శుక్రవారం ఉదయం నుంచి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న అంతర్గత వివాదాలు తెరపైకి వచ్చాయి. మంచు విష్ణు గొడవ చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇంటి వివాదం కాస్తా రచ్చకెక్కింది. అయితే ఇది ఫ్యామిలీ ఇష్యూ కావడంతో వెంటనే మోహన్ బాబు రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కబెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మనోజ్ షేర్ చేసిన వీడియో గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంచు మనోజ్ పెళ్లి.. మోహన్ బాబుకి ఇష్టం లేదనే వార్తలు కూడా వచ్చాయి.. అంతేకాకుండా మంచు విష్ణు కూడా తన తమ్ముడి పెళ్ళికి ఏదో గెస్ట్ లా అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడంటూ నెట్టింట కొన్ని వార్తలు హల్చల్ అయ్యాయి.
కాగా ప్రస్తుతం ఈ ఇష్యూపై మంచు విష్ణు రియాక్ట్ అయ్యాడు. మా ఇద్దరి మధ్య సాధారణ గొడవే జరిగిందన్నాడు. గురువారం ఉదయం జరిగిన చిన్న సంఘటన ఇది.. సారథితో నా వాగ్వాదాన్ని మనోజ్ ఆపలేకపోయాడు. దాన్ని మనోజ్ వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మనోజ్ చిన్నవాడు, ఇది స్పందించాల్సినంత పెద్ద విషయం కాదని విష్ణు చెప్పుకొచ్చాడు.
అలాగే లేటెస్ట్ గా లక్ష్మీ మంచు కూడా మీడియాతో మాట్లాడింది. మనోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ గురించి తనకు తెలీదని అంది. అలాగే ఎలాంటి వీడియోను తాను చూడలేదని, వివాదం గురించి విష్ణు, మనోజ్‌తో నేను మాట్లాడలేదని చెప్పింది. ప్రస్తుతం తాను బంధువులతో బిజిగా ఉన్నానని, విషయం తెలిశాక దీనిపై మాట్లాడుతానంటూ మంచు లక్ష్మీ చెప్పింది.