హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు మంచు విష్ణు. గతంలో చేసిన ఢీ సినిమా తర్వాత ఆ రేంజ్ లో హిట్ ను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ అంటే ఢీ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఫరియా అబ్దుల్లాను హీరోయిన్ గా కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
దీనితో పాటు మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడట విష్ణు. రాజేంద్ర అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడట. అలాగే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేసేందుకు డేట్స్ ని కూడా ఫిక్స్ చేశారట. పక్కా ఎమోషనల్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కబోతుందట.
ఈ సినిమాలో మంచు విష్ణు రా ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారట. మరి చూడాలి మంచు విష్ణు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడో. గతంలో మంచు విష్ణు కాజల్ తో మోసగాళ్లు సినిమా చేశాడు ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఇక మంచు విష్ణు ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.