మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలిచిన 11మంది సభ్యుల రాజీనామాలకు ఆమోదం తెలిపారు. రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరామని.. అయితే, దానికి వారు సిద్ధంగా లేకపోవడంతో నెల రోజుల తరవాత ఆమోదించాల్సి వచ్చిందని తెలిపారు. వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నామని తెలిపారు. అయితే, రాజీనామా చేసిన వారంతా ‘మా’ సభ్యులుగా కొనసాగుతారని విష్ణు అన్నారు. నాగబాబు, ప్రకాష్ రాజు కూడా ‘మా’ సభ్యులుగా కొనసాగుతారని తెలిపారు.
అటు, ఎన్నికల సమయంలో ప్రధానంశంగా మారిన మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. మా బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయని. ‘మా’ కమిటీ మీటింగ్ కూడా జరిగిందని తెలిపారు. వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తామని తెలిపారు.