మంచు విష్ణు ‘గాలి నాగేశ్వరరావు’ గా లీడ్ రోల్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రేణుక పాత్రలో కనిపించనుంది సెన్సేషనల్ బ్యూటీ సన్నీలియోన్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్న విష్ణు, సన్నీ సరదాగా ఓ రీల్ చేశారు. ఈ రీల్ ని ఇనస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది సన్నీలియోన్. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ మాస్క్ పెట్టుకుని నడుస్తూ వస్తున్న విష్ణును భయపెట్టడానికి ట్రై చేసింది సన్నీలియోన్. భయపడినట్టు నటిస్తూ, ఫన్ చేశాడు విష్ణు. బ్యాక్ గ్రౌండ్ లో ”చూపే బంగారమాయేనే శ్రీవల్లి..” పాట పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా సరదాగా ఉంది. ఈ వీడియోకి… ”అండ్ ఎగైన్ ఎపిక్ ఫెయిల్ ఫర్ మీ..” అని విష్ణు కామెంట్ చేశాడు. ఇలా రీల్ తో గాలి నాగేశ్వరరావుకు బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఇషాన్ సూర్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇక ఈ సినిమాకు కోన వెంకట్ కథ అందించారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనదే. నిజానికి ఇది కోన వెంకట్ కథ కాదు. దీనికి మూలకథ జి.నాగేశ్వరరెడ్డిది. ఆయన చెప్పిన పాయింట్ ను కోన పూర్తిస్థాయిలో డెవలప్ చేసినట్టున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు మంచు విష్ణు. ఓవైపు అసోసియేషన్ పనులు చూసుకుంటూనే, మరోవైపు తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. గాలి నాగేశ్వరరావు ప్రాజెక్టు పూర్తయిన వెంటనే, తన సొంత బ్యానర్ లో మరో సినిమాను తెరకెక్కించేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు.