అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నాడన్నారు ఎమ్మార్పీఎస్ నాయకులు మంద కృష్ణ మాదిగ. ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన సాధారణ ఎన్నికల్లో గెలుస్తామనుకోవటం అవివేకం అన్నారు. కోట్లరూపాయలు కుమ్మరించి ఉప ఎన్నికల్లో తెరాస గెలిచిందన్నారు. అధికార గర్వంతో ఆర్టీసీ ని లేకుండా చేస్తా అంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు మంద కృష్ణ. ఆర్టీసీ కార్మికులపై పోలీస్ లు, అక్రమంగా కేసులు పెట్టి బయపెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఎమ్మార్పీఎస్ ఉంటుందన్నారు. ప్రజల హక్కులను హరించే వారిని ఈ గడ్డమీదే భూస్థాపితం చేయాలని కాళోజీ అన్నాడు. ఇప్పుడు ప్రజలు అదే చేయబోతున్నారన్నారు మంద కృష్ణ మాదిగ.