2023లో తెలంగాణలో దొరల పాలనకు అంతమవుతుందని జోస్యం చెప్పారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. తెలంగాణలో దొరల రాజ్యం వస్తుందని, కేసీఆర్ దళితులను మోసం చేసి సీఎం అవుతాడని తాను తల్లితెలంగాణ పుస్తకంలో 2003లో చెప్పానని గుర్తు చేశారు.

లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చారని, మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణలో మాత్రం ఎందుకు చేర్చటం లేదని మందకృష్ణ ప్రశ్నించారు. కేసీఆర్ మాటను ధిక్కరించి కరోనా సోకిన ఎమ్మెల్యేలంతా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందతున్నారన్నారు. ఆరు సంవత్సరాల కేసీఆర్ పాలనలో దళిత, గిరిజనులకు ఎందుకు భూమి పంపిణీ జరగలేదని… రాజకీయంగా కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.