దళిత బంధు పథకం ప్రతీ దళిత కుటుంబానికి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితులను మోసం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి దళితులు మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మోసాలను గుర్తు చేశారాయన.
రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిని లేకుండా చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు. ఏడేళ్లుగా సీఎం ఆఫీస్ లో దళిత ఐఏఎస్ అధికారులు లేరని గుర్తు చేశారు. అగ్ర కులాల భవనాల నిర్మాణల కోసం హైదరాబాద్ లో భూములు కేటాయించి… దళిత భవనాలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే తెలంగాణ రాష్ట్రంలోనే దళితులు ఎక్కువగా నష్టపోయారని.. దేశంలో మొట్ట మొదటి మోసకరి కేసీఆరేనని విమర్శించారు.
కేసీఆర్ ని ఓడించినప్పుడే దళితులకు నిజమైన న్యాయం జరుగుతుందని చెప్పారు మందకృష్ణ. తెలంగాణ ఉద్యమంలో ముందుడి నడిపించింది దళితులేనని గుర్తు చేశారు. కాలికి గజ్జ కట్టి ఆడిపడి 4కోట్ల సమాజాన్ని నిద్ర లేపింది దళిత జాతేనని చెప్పారు. అలాగే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుపై పోరాటం చేసింది కూడా దళిత నాయకులేనని అన్నారు మందకృష్ణ మాదిగ.