రాజధాని అమరావతినే కొనసాగించాలాంటూ దీక్ష చేస్తున్న రాజధాని రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తక్షణమే దీక్ష శిబిరాన్ని ఖాళీ చెయ్యాలంటూ రైతులకు తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాప కింద నీరులా ప్రవేశించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు హైఅలెర్ట్ ను ప్రకటించాయి. అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ రాజధాని రైతుల మీద పడింది.
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ప్రభలిస్తుండటంతో ఎక్కడా కూడా జనసందోహం ఉంటానికి వీలులేదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటంతో
తుళ్లూరులో నిరసన శిబిరాలను ఖాళీ చేయాలంటూ నిరసనకారులకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినప్పటి నుంచి రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నారు.