పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘అరి’.. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన సినిమా ఇది. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
వైవిధ్యమైన కాన్సెప్ట్ తో అందరినీ ఆకట్టుకునే అంశాలతో రూపొందిన సినిమా ‘అరి’. ఈ చిత్రానికి సంబంధించి గతంలో విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా టాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ సింగర్ గా మారిన మంగ్లీ పాడిన తొలి పాటను విడుదల చేశారు.

కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతాన్ని అనూప్ రూబెన్స్ స్వరపరిచాడు. కొన్నాళ్లుగా కాసర్ల శ్యామ్ సాహిత్యం, మంగ్లీ గాత్రంలో వస్తోన్న పాటలన్నీ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఈ గీతం కూడా ఆ కోవలోనే శ్రీ కృష్ణుడుపై సాగే అద్భుతమైన మెలోడీగా ఆకట్టుకుంటోంది.
వినగానే క్యాచీగా ఉంది ఈ సాంగ్. మంగ్లీ పాడడంతో ఈజీగా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది. ఈ గీతాన్ని తెలంగాణలోని మొదటి హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీ సత్య గౌరవ్ చంద్రదాస్ చేతుల మీదుగా విడుదల చేశారు.