నిన్నటి వరకు వానను సైతం లెక్క చేయకుండా తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు రోడెక్కి నిరసన తెలిపిన ఘటన మరువక ముందే.. మరోకటి.. బాసర ట్రిపుల్ ఐటీకి ఏమైంది. కావాలని విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యలా..? అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.
ఇంత జరుగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు ఎందుకు వ్యవహరిస్తోంది. బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగిన సంగతి తెలిసిదే. ఘటన జరిగిన విసయం తెలిసి కూడా ప్రభుత్వం సీరియస్‌గా ఎందుకు తీసుకోవడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.
విద్యార్థుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోని ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ఆదాయం, జేబులు నింపుకోవడానికి మాత్రమే శ్రద్ధ వహిస్తున్నారని దుయ్యబట్టారు. కొడుకు, అల్లుడి రాజ్యాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఫుడ్ పాయిజన్ పై అధికారుల విచారణ కొనసాగుతోంది. రెండు క్యాంటీన్లపై కేసు నమోదు చేసిన అధికారులు వాటి టెండర్లు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ట్రిపుల్ ఐటీ సిబ్బంది తెలిపారు. నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి 9 మంది డిశ్చార్జి అవగా..మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లు ఆందోళనలు చేపట్టి నెల గడవక ముందే మళ్లీ ఫుడ్ పాయిజన్ అవడంతో విద్యార్థుల తల్లిద్రండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.