ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు ప్రధాని మోదీకి లేఖ రాసిన తర్వాత కేసీఆర్ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులను కలిసేందుకు వెళ్తున్నారా లేక లేక ఢిల్లీ మే దోస్తీ కార్యక్రమంలో భాగంగా కలిసేందుకు వెళ్తున్నారా అని ప్రశ్నించారు. అలా అయితే రైతులకు మద్దతు తెలుపుతున్నదంతా కేవలం నోటి మాటేనా అంటూ ఠాగూర్.. కేసీఆర్‌పై ట్వీట్ చేశారు.
Whether Chandrasekar visit to Delhi after the letter to Narender to meet the farmers who are in #Farmersprotests or part of the “Delhi mey Dosti” program?Then Farmers support only lip service 🤔 pic.twitter.com/5SBF71MZag
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) December 11, 2020
మరోవైపు సీఎం కేసీఆర్.. మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్తున్నారు.అధికారికంగా పర్యటించకపోయినప్పటికీ.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రైతు సంఘాలు, విపక్షాల నేతలతో కేసీఆర్ భేటీ అవుతారనే అంచనాలున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ కార్యాలయం కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని కూడా పరిశీలిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.